భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి
భగత్ సింగ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి*
సర్ధార్ భగత్ సింగ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ సీనియర్ నాయకులు నల్లా రామారావు, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అన్నారు. భగత్ సింగ్ 119 వ జయంతి సందర్భంగా స్థానిక రాజేంద్రనగర్ లో భగత్ సింగ్ విగ్రహం వద్ద
జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి సీపీఐ సీనియర్ నాయకులు నల్లా రామారావు,నల్లా భ్రమరాంబ,పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా నల్లా రామారావు మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో భగత్ సింగ్ పాత్ర మరవలేనిదని, భగత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడారు.బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28 న బంగా అనే గ్రామంలో జన్మించారని, 23 సంవత్సరాల వయస్సు లోనే దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ త్యాగనిరతి నేటి యువతకు స్పూర్తి అని అన్నారు, ప్రతీ ఏడు జయంతిని వర్ధంతిని నిర్వహిస్తున్న నల్లా రామారావు,నల్లా భ్రమరాంబ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేటీ శ్రీనివాస్,రబ్బానీ, అజీమ్,కాలెపు నాగేశ్వరరావు,కొణపల సుబ్రహ్మణ్యం,కొండపల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.