BREAKING
టిడిపి కార్యాలయంలో భగత్ సింగ్, గుర్రం జాషువా ల జయంతి పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు - 2 భాగాలుగా చెల్లించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలి - పాత విధానంలోనే ఒకేసారి అందించాలి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షుడు చాగలేటి భాస్కర్ పులివెందుల న్యూస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రెండు భాగాలుగా చెల్లించే విధానాన్ని ప్రభు ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ భారీ ర్యాలీ శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు మంత్రి నారాయణ మాస్ పిక్చర్ దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన *భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పనులు త్వరగా ప్రారంభించాలి: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రాయించెరువులో సాగునీరు నింపాలి - బీజేపీ నేతల డిమాండ్. SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా 3 రోజుల్లో నాని ‘ది ప్యారడైజ్’ వరల్డ్‌వైడ్ కలెక్షన్ల సునామీ పురట్చి తలైవర్ పేరుతో దిగ్గజ నటుడు ఎంజీఆర్ బయోపిక్.. కీలక పాత్రలో జేఎం బషీర్! సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం

పుష్పాల వైభవంగా గరుడవాహనం

Select Suryaa Now
పుష్పాల వైభవంగా గరుడవాహనం

పుష్పాల వైభవంలో గరుడ వాహనం..!

లక్షల విలువైన స్వదేశీ, విదేశీ పుష్పాలతో గణనాథుడికి కనులవిందైన అలంకరణ

మూడు రాత్రులు.. రెండు పగళ్లు.. 20 మంది కళాకారుల అహర్నిశల శ్రమ

కడియం,న్యూస్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కడియపులంక పూల మార్కెట్‌లో కొలువుదీరిన గణనాథుడు పుష్పాల వైభవంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.లక్షలాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ రంగురంగుల పుష్పాలతో రూపొందించిన అద్భుతమైన ‘గరుడ వాహనం’  ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్పాలతో తీర్చిదిద్దిన గరుడ వాహనం, దానిపై కొలువైన గణనాథుడి దివ్య రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.

ఈ అపూర్వ పుష్పాలంకరణకు రూపకల్పన చేయడంలో సుమారు ఇరవై మంది నిపుణులైన కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యులు మూడు రాత్రులు, రెండు పగళ్లు అహర్నిశలు శ్రమించారు. పుష్పాల తాజాదనం, ఆకర్షణ ఎక్కువసేపు నిలిచేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి పువ్వును కళాత్మకంగా అమర్చి గరుడ వాహనాన్ని తీర్చిదిద్దారు.

ఈ పుష్ప వాహనం కోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా పుష్పాలను తెప్పించారు. ఆర్కిడ్స్, జెర్బెరాస్, పింక్ గులాబీలు, పసుపు గులాబీలు, తెల్ల చామంతి, నీలిరంగు చామంతి, లిల్లీలు, మల్లెపూలతో పాటు కడియపులంక నర్సరీల్లో లభించే సంప్రదాయ పుష్పాలను సైతం మేళవించారు. వివిధ రంగులు, ఆకృతులు, పుష్పాల అమరికతో గరుడ వాహనం చూపరులను విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించారు.

పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన గరుడ వాహనాన్ని, దానిపై కొలువైన గణనాథుడి దివ్య స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కడియపులంక  తరలివస్తున్నారు. 

ప్రత్యేక పుష్పాలంకరణను ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. 

ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తూ గ్రామంలో సాగిన శోభాయాత్ర తో అధ్యంతం ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

గరుడ వాహనాన్ని తీర్చిదిద్దిన కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యుల సృజనాత్మకతను మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాగులపల్లి వీరబాబు, స్థానికులు, భక్తులు అభినందిస్తున్నారు.

పుష్పాల అందం.. కళాకారుల నైపుణ్యం.. గణనాథుడి దివ్య రూపం కలగలిసి కడియపులంకలో గణేష్ ఉత్సవాలకు ఈ గరుడ వాహనం మరింత వైభవాన్ని తీసుకొచ్చింది.