BREAKING
బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఫిర్యాదులపై నిష్పక్షపాత విచారణ జరపాలి మార్కాపురం జిల్లా డీఆర్వోగా శ్రీదేవి ఓటీటీకి సందీప్ రెడ్డి వంగా చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రోమాంచకం బిగ్‌బాస్ హౌస్‌లో మిథిలేష్ సంచలనం..ఆదివారం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు స్కూల్ కమిటీ చైర్మన్లుగా అందరూ గెలవాలి: సింగిల్ విండో చైర్మన్ గుర్రం లక్ష్మీనారాయణ టిడిపి కార్యాలయంలో భగత్ సింగ్, గుర్రం జాషువా ల జయంతి పింఛన్ల చెల్లింపులో గందరగోళం తగదు ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై కాంగ్రెస్‌ భారీ ర్యాలీ శాంతిభద్రతలపై పటిష్ట నిఘా బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు మంత్రి నారాయణ మాస్ పిక్చర్ దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన *భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి

థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Select Suryaa Now
 థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

సూర్య సినిమా డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించే ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటుంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి, తాజాగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సర్దార్ 2 అనుహ్యంగా అతి త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సర్దార్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రారంభంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ 2 సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో కార్తి సరసన ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ నటిస్తుండగా, టాలెంటెడ్ నటుడు ఎస్జే సూర్య పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించారు. అయితే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమాను అనుకున్నదానికంటే వేగంగా ఓటీటీ బాట పట్టించారు. ఈ వచ్చే గురువారం, అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అంటే థియేటర్లలో విడుదలైన కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే సినిమా ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

కథ పరంగా చూస్తే, సర్దార్ మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ కొనసాగుతుంది. ఇన్‌స్పెక్టర్ నుంచి రా ఏజెంట్‌గా మారిన విజయ్ తన ఉన్నతాధికారికి సైతం తెలియకుండా ఒక రహస్య ఆపరేషన్‌ను ప్రారంభిస్తాడు. మాజీ రా ఏజెంట్ వాల్‌రస్‌ను వెతికి పట్టుకునే క్రమంలో రంగంలోకి దిగగా, అప్పటికే ఎస్జే సూర్య పోషించిన యోగానంద్ నేతృత్వంలోని బ్లాక్ డాగర్ ముఠా ఆ ఏజెంట్ కోసం వెతుకుతుంటుంది. ఆ ముఠా దాడిలో వాల్‌రస్‌ మరణిస్తూ విజయ్‌కు మిషన్ డోకు గురించి చెబుతాడు. దేశంలో జరగబోయే భారీ విధ్వంసాన్ని అడ్డుకోవడానికి తండ్రీకొడుకులు సర్దార్, విజయ్‌లు చేసిన సాహసాలే ఈ చిత్ర కథాంశం. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను వీక్షించవచ్చు.