స్థల వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో తమ ఇంటి ముందున్న స్థలానికి సంబంధించి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయని ఎం.డి. మోకార్ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సుమారు 75 ఏళ్లుగా తమ కుటుంబం వినియోగిస్తున్న స్థలానికి సంబంధించిన వాస్తవాలను రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖల ద్వారా సమగ్రంగా విచారించాలని కోరారు. స్థలంలో మతపరమైన నిర్మాణం విగ్రహం ఏర్పాటు వల్ల రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.