BREAKING
థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి.... రామాపురానికి సీఎం చంద్రబాబు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పుష్పాల వైభవంగా గరుడవాహనం బంగాళాఖాతంలో మరో వాయుగుండం బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధికి మరో అడుగు మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్! నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు

SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

Select Suryaa Now
SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

- సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి: సీపీఐ

- అక్టోబర్‌ 1న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు

ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో శంషాబాద్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా అధ్యక్షుడు పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ బాధ్యత వహించాలని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా లేదని, దీనివల్ల పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని జంగయ్య విమర్శించారు. కుల, మత రాజకీయాల ద్వారా సమాజంలో విభేదాలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయకపోతే అక్టోబర్‌ 1న సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని జంగయ్య ప్రకటించారు. ఈ కార్యక్రమాలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం నినాదాలు చేశారు.

- పోతుల నరసింహ : మేజర్ న్యూస్, శంషాబాద్.