BREAKING
*భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పనులు త్వరగా ప్రారంభించాలి: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రాయించెరువులో సాగునీరు నింపాలి - బీజేపీ నేతల డిమాండ్. SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా 3 రోజుల్లో నాని ‘ది ప్యారడైజ్’ వరల్డ్‌వైడ్ కలెక్షన్ల సునామీ పురట్చి తలైవర్ పేరుతో దిగ్గజ నటుడు ఎంజీఆర్ బయోపిక్.. కీలక పాత్రలో జేఎం బషీర్! సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి.... రామాపురానికి సీఎం చంద్రబాబు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పుష్పాల వైభవంగా గరుడవాహనం బంగాళాఖాతంలో మరో వాయుగుండం

నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి

అనంతపురం బ్యూరో

 

నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి

మూడు రోజులైనా కేసు నమోదు చేయని ఆత్మకూరు పోలీసులపై ఆరోపణలు

అనంతపురం: నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం (GVSS) రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ నాయక్ డిమాండ్ చేశారు.

అనంతపురంలోని విద్యుత్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు మండలం సింగంపల్లి తండాలో నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి, సంబంధిత వ్యక్తిపై ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మూడు రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల జోక్యం ఉందని కొందరు ఆరోపిస్తున్నారని, అయితే దీనిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని శివకుమార్ నాయక్ కోరారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే చర్యలను సహించబోమని, నకిలీ ధ్రువీకరణ పత్రాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.