మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత ప్రతిజ్ఞ
తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం
సూర్య తిర్యాణి:తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ‘నిషా ముక్త్ యువ ప్రతిజ్ఞ’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్రతిజ్ఞలో పాల్గొన్న అనంతరం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
స్థానిక ఎస్సై సుబ్బారావు, వైద్యులు కౌటిల్య విద్యార్థులతో మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యసనం ఆరోగ్యం, చదువు, భవిష్యత్తుపై చూపే ప్రతికూల ప్రభావాలను వివరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపల్ జి.అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.