రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు సాదర వీడ్కోలు
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు సాదర వీడ్కోలు
రేణిగుంట: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. రెండు రోజుల జిల్లా పర్యటన అనంతరం మంగళవారం మద్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం అయిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, శ్రీ కాళహస్తి, నగరి, పూతలపట్టు, చంద్రగిరి ఎం ఎల్ ఏ లు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, కె. మురళి మోహన్, పులివర్తి నాని, తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, ఆర్ డి ఓ లు, తహశీల్దార్ లు, తదితరులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు.