BREAKING
టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం మోడల్‌ స్కూల్‌ చైర్మన్‌గా నత్తం మాధవ్‌ పరిగి లో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.… స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మోదీ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం ‘తత్వం’ విజయం సాధిస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం.. దర్శకుడు అర్జున్ కోలా కామెంట్స్!

సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌

Select Suryaa Now
సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌

రాజమహేంద్రవరం :దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూల్చివేసేందుకు వెన్ను పోటు పార్టీ కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరి స్తోందని వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ అయ్యారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు విజయవాడ వచ్చిన సచివాలయ ఉద్యోగులపై పోలీసులు అమానుషం గా దాడులకు తెగబడటం హేయమని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో సంహిత కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహిం చిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా జుట్లు పట్టుకుని రోడ్లపై ఈడ్చుకెళ్లి, వీధి కుక్క లను మున్సిపాలిటీ బండ్లలో కుక్కినట్లుగా పోలీసు వ్యాన్లలోకి నెట్ట డం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ నిరం కుశత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివి రాత్రింబవళ్లు ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగు లను కొన్ని మీడియా ఛానళ్లలో పోరంబోకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ అంటూ అత్యంత హేయమైన భాషతో కించపరచడం దుర్మార్గమని దుయ్యబ ట్టారు.ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన వెన్నుపోటు పార్టీ కూట మి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నా రని.. వీధుల్లోకి వెళితే కూటమి నాయకులకు చీపురు దెబ్బలు తప్పవని హెచ్చరించారు.

హక్కులడిగితే వీధి కుక్క ల్లా ఈడ్చుకె ళ్తారా?: 
గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్లకు, మంత్రు లకు పలుమార్లు అర్జీలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ప్రజా స్వామ్య పద్ధతిలో విజయవాడలో నిరసన తెలపడానికి వెళ్లారు. శాంతియుతంగా తమ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్లిన ఉద్యోగులపై పోలీ సులు కర్కశంగా విరుచు కుపడ్డారు. మహిళా ఉద్యోగుల జుట్లు పట్టు కుని రోడ్ల మీద లాగారు. మున్సిపాలిటీ బండ్లలో వీధి కుక్కలను ఎక్కించి నట్లుగా వారిని పోలీసు వ్యాన్లలో కుక్కారు. ఒంటిపై చేతులు వేసి దాష్టీకం ప్రదర్శించారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.

మీడియాలో పోరం బోకులు అనడం అత్యంత హేయం:
డిగ్రీలు, పీజీలు, డబుల్‌ పీజీలు చదివి, తీవ్ర పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రజాసేవ లోకి వచ్చిన ఉద్యోగు లను కొన్ని మీడియా ఛానళ్లు బ్లేడ్‌ బ్యాచ్, గాంజా బ్యాచ్, పోరం బోకులు అంటూ అసభ్య పదజాలంతో దూషించ డం దారుణం. జర్నలిజం ముసుగులో ఇంత నీచమైన భాష వాడ తారా? అని ప్రశ్నించారు
కోవిడ్‌ విపత్కర పరిస్థితుల నుంచి నేటి వరకు సచివాలయ ఉద్యో గులు చేసిన సేవలు గ్రామీణ ప్రాంతాల్లోని  ఏ పేదవాడిని అడిగినా తెలుస్తుందన్నారు.
బాధ్యతాయుతమైన ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడే వారికి బుద్ధి చెప్పే రోజు లు దగ్గర పడ్డాయన్నారు.