ఉదయగిరి నియోజకవర్గం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో--చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
•నెల్లూరు, మేజర్ న్యూస్: పల్లె పండుగ 3.0 కింద రూ.11,085 కోట్లతో గ్రామీణాల్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం, డిప్యూటీ సీఎం.
• సీఎం, డిప్యూటీ సీఎంలు సభా వేదిక మీదకు రాగానే సభికుల నుంచి అపూర్వ స్వాగతం.
• తమ మెళ్లో వేసుకున్న కండువాలను గాల్లో ఊపుతూ స్వాగతం పలికిన సభికులు.
• ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.
• ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చూసి ఆనందంతో డ్యాన్సులు చేసిన పలువురు మహిళలు.
• సీఎం, డిప్యూటీ సీఎం ర్యాంప్ వాక్‌ను తమ కుర్చీల్లో నుంచి లేచి ఫోన్లల్లో ఫొటోలు తీసుకున్న పలువురు సభికులు.
• పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా గత ప్రభుత్వంలో రోడ్లు, గ్రామాల దుస్థితి గుర్తు చేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధిని వివరిస్తూ వీడియో ప్రజంటేషన్
• కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, రామా నాయుడు, రామనారాయణరెడ్డి, ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు