వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి ; వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సంగారెడ్డిలోని ప్రైడ్ హార్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, ఒత్తిడి నియంత్రణతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఎసి మాజీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్ వైద్యులు అనిల్ మాట్లాడుతూ… గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. హాస్పిటల్ ప్రారంభించి విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ రేజింతల్ సర్పంచ్ గడిల ఆశి రెడ్డి,అభిలాష్ కాంగ్రెస్ నాయకులు జార్జ్ ప్రవీణ్ కుమార్, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నూతనంగా తమ హాస్పిటల్ లో అందుబాటులోకి తీసుకువచ్చిన లూకాస్ 2 చెస్ట్ మిషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో గుండె ఆగిపోయిన సమయంలో ఛాతీపై కంప్రెషన్స్ అందించేందుకు ఉపయోగించే ఈ పరికరం ద్వారా నిరంతరంగా, నాణ్యమైన ఛాతీ కంప్రెషన్స్ అందించవచ్చని వైద్యులు తెలిపారు. అత్యవసర వైద్య సేవల్లో ఆధునిక సాంకేతికత వినియోగం ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.