BREAKING
విరాట్ కోహ్లి భారీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. ఐఎల్‌టీ20 అరంగేట్రంలోనే అదుర్స్! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో భారత రికార్డు! అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌ ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి

Select Suryaa Now
ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి

ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి

-- జిల్లా పరిషత్తును ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టరు, జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి

ఏలూరు, మేజర్ న్యూస్ : జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం  జిల్లా కలెక్టరు, జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరుకు, జిల్లా పరిషత్తు డిప్యూటీ సిఇవో కె.భీమేశ్వర్, ఇతర అధికారులు పూలమొక్కలను అందజేశారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు పేరుపేరునా పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు, జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండి, అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానం ఇచ్చేలా ఉండాలని అన్నారు. బదిలీపై వచ్చిన ఉద్యోగులకు ఇంకా సీట్లు కేటాయించక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెనువెంటనే సీట్లు కేటాయించి, విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికలకు అధికారులు, ఉద్యోగులు సంసిద్ధులే ఉండాలని అన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని, ఎన్ని పరిష్కారం చూపారని, ఇంకా ఎన్ని పెండింగులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విశ్రాంత  ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంటు, పిఎఫ్ లు, తదితర బకాయిలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కార్యాలయంకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది బాధ్యతా యుతంగా విధులు నిర్వహించాలని అన్నారు. రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు, పెండింగు అంశాలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులకు హాజరై, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇవో కె.భీమేశ్వర్, ఏవో కె.వి.విక్టర్ జాన్సన్, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

 

 కే బాల సౌరి న్యూస్ బ్యూరో ఏలూరు