BREAKING
సీపీఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభం ఘనంగా పోషణ మాసోత్సవాలు -గర్భిణులకు సీమంతాలు, పోషకాహారంపై అవగాహన గుండెను కాపాడుకుంటేనే ఆరోగ్యకరమైన జీవితం ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు. కోదాడ (మేజర్ న్యూస్) ​విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యకరమైన అలవాట్లతో తమ వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని సంఘ భవనంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా జయప్రదం చేయండి-- చల్ల వీరభద్రుడు పల్లె పండుగతో గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు ప్రశాంతంగా ఎస్ఎంసి ఎన్నికలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన బోధన.... మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి. మౌలిక వసతులు అభివృద్ధి పనులపై దృష్టి ప్రభుత్వ సంక్షేమ-- అభివృద్ధి ప్రాధాన్యత అంశాలపై అధికారులు దృష్టి సారించాలి కాకొల్లువారిపల్లెలో పల్లె పండుగ పనులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం హ్యాండ్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు ఆగమ సలహాదారుకి పార్థసారథి భట్టాచార్య పురస్కారం అంగన్వాడి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు! గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

కోటపల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

Select Suryaa Now
కోటపల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

మత్స్యకారుల ఆదాయం మరింత పెంచేందుకు కృషి.. రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29):
వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలాన్ని పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకార కుటుంబాల ఆదాయం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.మంగళవారం కోటపల్లి మండలంలోని లింగంపల్లి, బుగ్గాపురం గ్రామాలతో పాటు మండల కేంద్రంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు సుమారు రూ.50 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎంపీ ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కోటపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ‘అంగన్ మిలాన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు బొమ్మలు, ఆట వస్తువులు అందజేయడంతో పాటు అంగన్‌వాడీ ఆయాలను సన్మానించారు.
*యువతకు అండగా యువజన క్లబ్‌
కోటపల్లి శివాలయం సమీపంలో గతంలో ఎంపీగా ఉన్న సమయంలో సుమారు రూ.21 లక్షల నిధులతో నిర్మించిన యువజన క్లబ్ భవనాన్ని ప్రజల సమక్షంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటపల్లి మండలంలో పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధిపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.
*మత్స్యకారుల ఆదాయం రూ.18 వేలకు పెరిగింది
2013లో కోటపల్లి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మత్స్యకార కుటుంబాలకు చేపల ద్వారా సుమారు రూ.1,200 మాత్రమే ఆదాయం వచ్చేదని ఎంపీ గుర్తుచేశారు. తాను ఎంపీగా ఎన్నికైన అనంతరం కోటపల్లి చెరువులో చేపల పెంపకం అభివృద్ధికి ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఒక్కో మత్స్యకార కుటుంబానికి సుమారు రూ.18 వేల వరకు ఆదాయం వస్తోందన్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కొత్త అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.2019 ఎన్నికల అనంతరం కొందరు నాయకుల స్వార్థపూరిత చర్యల కారణంగా కోటపల్లి మండల అభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు, తీర్మానాలు ముందుకు సాగకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులు ఐకమత్యంగా ఉండి, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
*దాడి ఘటనపై ఖండన.. రూ.లక్ష సాయం
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ రావుల బస్సమ్మ భర్త సంగమయ్యపై జరిగిన దాడిని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. ఘటన అమానవీయమని పేర్కొంటూ బాధిత కుటుంబానికి భారతీయ జనతా పార్టీ తరఫున రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.కోటపల్లి మండల అభివృద్ధిపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, అవసరమైతే మండల కేంద్రంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన కూడా ఉందని తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు సబ్‌ పోస్టాఫీస్ ఏర్పాటు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రమేష్‌కుమార్, వికారాబాద్ జిల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, శేరి శ్రీధర్‌రెడ్డి, నరోత్తమ్‌రెడ్డి, పతంగి పాండు, బుగ్గాపురం సర్పంచ్ మహేందర్ దొర, కోటపల్లి సర్పంచ్ రావుల బస్సమ్మ, మండల బీజేపీ అధ్యక్షుడు శివకుమార్, గ్రామ పెద్దలు, మత్స్యకార కుటుంబాల సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.