BREAKING
భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం విద్యుత్ సేవలకు ప్రభుత్వం అభినందనలు...సూపరిండెంటింగ్ ఇంజనీరు పి సుధాకర్ అవినీతి ఆరోపణపై సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధం.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి అర్జునులొద్ది గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి ఇనమడుగులోని ఎస్సి కాలనీలో ఉచిత హోమియోవైద్యశిబిరము : డా కరుణాకర్ నిర్వహణ, పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కాంట్రాక్ట్ ఉద్యోగుల 100% గ్రాస్ శాలరీ అమలుకు కీలక ముందడుగు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం జైనూర్ సీహెచ్‌సీలో కలెక్టర్ కె. హరిత ఆకస్మిక తనిఖీ కర్ణాటక డీజీపీ దయానంద్‌ ను కలిసిన వెంకటేష్ నాయుడు -డీజీపీగా పదోన్నతి పొందినందుకు అభినందనలు అఖిల భారత కిసాన్ సభలను జయప్రదం చేయండి* చిట్యాల- మేజర్ న్యూస్ జ్వరంతో శ్రీరాంపూర్ గూడలో వ్యక్తి మృతి రాష్ట్రస్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్‌ విద్యార్థులు

గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

 గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేగవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. సూర్యతేజ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షలు, చికిత్స అందించగా, ఏలూరు శంకర నేత్ర చికిత్సాలయం సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

మానవత మండల అధ్యక్షుడు తన్నీరు రామకృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి బేతా రమేష్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, మానవత సభ్యులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు కుక్కల సత్యనారాయణ వైద్యులు, మానవత సభ్యులకు భోజనం, టిఫిన్ ఖర్చులను భరించారు. ఈ సందర్భంగా ఆయనకు మానవత సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మహంకాళి రంగ ప్రసాద్, కన్వీనర్ త్రిపుర రమేష్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు దల్లి కేదారేశ్వరరెడ్డి, కార్యవర్గ సభ్యులు గద్దె సత్యనారాయణ, కర్పూరం వెంకన్నబాబు, కన్నా లక్ష్మణరావు, సూర్యతేజ హాస్పిటల్ డైరెక్టర్ పోల్నాటి రాజా తదితరులు పాల్గొన్నారు.

 కె.వి.రమణారావు జంగారెడ్డిగూడెం