ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ
ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,
మండలంలోని గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించడంతో పాటు తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసన, వాహన పూజలు నిర్వహించుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల ద్వారా రూ.2,25,351 ఆదాయం సమకూరగా, సుమారు 2,223 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
మొక్కల పంపిణీ
అటవీ శాఖ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి. దుర్గాకుమార్ బాబు, డీఆర్‌ఓ పి. ధర్మారావు, ఎఫ్‌ఎస్‌ఓ పాపారత్నం, అటవీ సిబ్బంది, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. వివరాలను ఆలయ అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈఓ ఆర్.వి. చందన తెలిపారు.
కె.వి.రమణరావు జంగారెడ్డిగూడెం