BREAKING
గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం జిల్లాస్థాయి ఆటల్లో మెరిసిన బాలికలు దూరవిద్య తో ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు . ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ గుణకనపల్లె లో పారిశుద్ధంపై ఎంపీడీవో ప్రత్యేక పర్యవేక్షణ రాయలసీమ అభివృద్ధి లక్ష్యం... -గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ గా లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర అభివృద్ధి ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘన సత్కారం భారీ వర్షాలతో పుచ్చకాయ పంటకు నష్టం 22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు - పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు నాటి విధ్వంసానికి నేటి వికాసానికి తేడా చూడండి మనోవికాస కథలు పుస్తకావిష్కరణ మేము పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే వాళ్లు రక్తాభిషేకం అంటున్నారు

తప్పుడు పత్రాలతో భూ కబ్జా యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

Select Suryaa Now
తప్పుడు పత్రాలతో భూ కబ్జా యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

 

A1 గొనె సంతోష్ రెడ్డి, A2 సయ్యద్ సయిదుద్దీన్ లను రిమాండ్ కి తరలించిన పోలీసులు

ప్రధాన నిందితుల కోసం పోలీసుల గాలింపు

భూ కబ్జాలకు పడితే ఉపేక్షించేది లేదని తెలిపిన సీఐ

 సూర్య కరీంనగర్: రేకుర్తి రెవెన్యూ శివారు సర్వే నెం.49లోని 599 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని తప్పుడు దస్తావేజుల ద్వారా కాజేయడానికి ప్రయత్నించిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదుదారు అనీస్ అహ్మద్ ఖాజీ తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నెం.49లో ప్లాట్ నెం.25, 44లకు సంబంధించిన మొత్తం 599 చదరపు గజాల స్థలాన్ని 1983, 1984 సంవత్సరాల్లో కొనుగోలు చేసి, అనంతరం తన భార్య పేరిట ఉన్న ఆస్తిని గిఫ్ట్ సెటిల్మెంట్ ద్వారా తన పేరిట మార్చుకున్నట్లు తెలిపారు. ఈ స్థలాన్ని కాజేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి, తన భూమి హద్దులను చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు బ్యాంకు రుణం పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదుపై కొత్తపల్లి పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. కేసులో A1 గోనె సంతోష్ రెడ్డి, A2 సయ్యద్ సాయిదుద్దీన్లను పోలీసులు అరెస్ట్ చేశారు .కేసుతో సంబంధం ఉన్న మరికొందరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
భూమికి సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణానికి సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. భూ కబ్జాలు, తప్పుడు దస్తావేజుల సృష్టి వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.