గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి..
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి..
విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక చర్యలు..
నీటి తలెత్తకుండా నూతన బోర్లు..
వీధి దీపాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక..
శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు ; ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ.. ఇందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో.. వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ సర్కిల్, పటాన్చెరు సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్ నినో ప్రభావంతో తాగినీటి సమస్యలు తలెత్తకుండా.. అవసరమైన చోట్ల నూతన బోర్స్ వేయాలని ఆదేశించారు. సి ఎస్ ఆర్ నిధుల ద్వారా పారిశుద్ధ్య విభాగానికి స్వీపింగ్ మెషీన్లు, టిప్పర్లు కొనుగోలు చేయడం జరిగిందని..త్వరలోనే అందజేయడం జరుగుతుందని తెలిపారు. వారానికి ఒకసారి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని.. తాను సైతం పాల్గొంటానని తెలిపారు. ప్రజల నుండి వీధి దీపాల అంశంపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే సరిపడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, డిఈలు కృష్ణవేణి, వెంకటరమణ, చరణ్ సింగ్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.