BREAKING
అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌ ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం ..

22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి

Select Suryaa Now
22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం  -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి

22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం

-- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి

 ఏలూరు, మేజర్ న్యూస్ :  జిల్లాలో రెవిన్యూ సమస్యలకు సంబంధించి  పిజిఆర్ఎస్ ద్వారా అందిన 22 వేల 513 ధరఖాస్తులలో 19 వేల 472 అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. 22ఏ భూ సమస్యల పరిష్కారం, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం,, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ,  రెవిన్యూ సమస్యలు,  రీ సర్వే రెవిన్యూ రికార్డుల డిజిటైజేషన్ ,అటవీ భూముల వివరాలు వెబ్ ల్యాండ్ లో నమోదు,  తదితర  అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం  రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో  జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తులపై ధరఖాస్తుదారుని కలిసి సమస్య తెలుసుకుని నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. 22ఏ భూ సమస్యలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా నిబంధనల ననుసరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను నిర్దేశించిన లక్ష్యాల మేర పూర్తిచేయాలన్నారు.  అక్టోబర్ నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో  అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ధరఖాస్తుదారుని కలిసి సమస్య తెలుసుకుని నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.   ఏలూరు జిల్లాలో జూన్ 15  వ తేదీ నుండి సెప్టెంబర్, 28వ తేదీ వరకు 22ఏ భూ సమస్యలపై 491 దరఖాస్తులు అందగా వాటిలో 211 దరఖాస్తులు పరిష్కరించామని, నిబంధనల మేరకు లేని 208 దరఖాస్తులను కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామన్నారు. జిల్లాలో రీ సర్వే  పనులను  నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేస్తామన్నారు.    సెప్టెంబర్ నెలలో జిల్లాలోని    13 వేల 131  పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేశామనన్నారు. రెవిన్యూ రికార్డుల డిజిటైజేషన్ కు  4367 అంశాలకు 7సంబందించిన  లక్షల 34 వేల 612 రికార్డులు, రెండవ విడతలో 2808 అంశాలకు సంబందించిన 6 లక్షల 51 వేల  158 రికార్డులు డిజిటైజేషన్ కు చర్యలు తీసుకుంటున్నామని   కలెక్టర్ తెలియజేసారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ,  ఇంచార్జ్ డిఆర్ఓ ఏం. ముక్కంటి,  నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ,  ప్రభృతులు పాల్గొన్నారు.

 

 న్యూస్ బ్యూరో బాలశౌరి, ఏలూరు