BREAKING
కాకొల్లువారిపల్లెలో పల్లె పండుగ పనులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం ఆగమ సలహాదారుకి పార్థసారథి భట్టాచార్య పురస్కారం అంగన్వాడి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు! గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం జిల్లాస్థాయి ఆటల్లో మెరిసిన బాలికలు దూరవిద్య తో ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు . ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ గుణకనపల్లె లో పారిశుద్ధంపై ఎంపీడీవో ప్రత్యేక పర్యవేక్షణ రాయలసీమ అభివృద్ధి లక్ష్యం... -గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ గా లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర అభివృద్ధి ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘన సత్కారం భారీ వర్షాలతో పుచ్చకాయ పంటకు నష్టం 22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు - పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు

స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Select Suryaa Now
స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

 స్థానిక పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. 

మెసిక్ పోర్టల్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ ; మెదక్ జిల్లాలో చదువుకున్న యువతకు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పటిష్ట ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.మంగళవారం జిల్లా వీడియో సమావేశ మందిరంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చదువుకున్న యువతకు వారు ఎంచుకున్న రంగాల్లో స్థానిక పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, నైపుణ్యాలు కలిగిన యువత వివరాలతో సమగ్ర సమాచార నిధిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు వారి ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ అందించి, తగిన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.మెసిక్‌ (మెదక్ ఉపాధి, నైపుణ్యాలు, పరిశ్రమల అనుసంధానం) అంతర్జాల వేదిక ద్వారా విద్యార్థులు, పరిశ్రమలు, యజమానుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించవచ్చని కలెక్టర్ వివరించారు. ఈ వేదిక ద్వారా యువత విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా పరిశ్రమల అవసరాలను అనుసంధానించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని తెలిపారు.జిల్లాలో యువతకు ఉపాధి కల్పనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, శిక్షణ పొందిన యువత వివరాలను సేకరించి, పరిశ్రమల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఉపాధి కల్పన అధికారి రామరాజు, పరిశ్రమల శాఖ అధికారి యాదయ్య, పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సంబంధిత విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.