BREAKING
రాయికల్ మండలంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ మేడారంలో నాని సందడి.. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన 'ది ప్యారడైజ్' టీమ్! ప్రభుత్వ పాఠశాల ఎస్ఎంసి వైస్ చైర్మన్ గా రాజశేఖర్ టిడిపి ఒంగోలు నియోజక వర్గ వి స్తృతస్థాయి సమావేశంల లో ఎంపీ మాగుంట ఎక్కడ సమస్య ఉన్న ముందుంటా వైయస్ మనోహర్ రెడ్డి తప్పుడు పత్రాలతో భూ కబ్జా యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్ పల్లె పండుగతో అభివృద్ధికి కొత్త ఊపిరి కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం… గట్కా క్రీడలో పందలపాక విద్యార్థుల ప్రతిభ: రాష్ట్రస్థాయి పోటీలకు 8 మంది ఎంపిక రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం*

పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Select Suryaa Now
పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

పల్లె పండుగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..

•    పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నాందీ పలుకుతున్నాం.
•    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మూడు పల్లె పండుగలు నిర్వహించుకున్నాం.. అన్నీ సక్సెస్ అయ్యాయి.
•    ఉద్యమ స్పూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా.
•    చెప్పిన విధంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ రెండేళ్లల్లో అభివృద్ధి చేస్తోంది. జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాం.
•సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో రాష్ట్రాన్ని నిలబెట్టాం.
•    2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు వృధా కాలేదు... ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.
•    2024 ఎన్నికల నాటి కంటే ఎన్డీఏ హవా పెరిగింది.
•    పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు మహిళలు, ప్రజలు సిద్దంగా ఉన్నారు.
•    గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి పల్లెలు కన్నీళ్లు పెట్టుకున్నాయి.
•    నాడు ఎక్కడ చూసినా గుంతలు.. వీధి దీపాలు లేవు.. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొట్టాలన్నా దిక్కు లేని పరిస్థితి.
•    నాటి దుస్థితి నుంచి పవన్ కళ్యాణ్ పల్లెలను అభివృద్ధి బాట పట్టించారు.
•    కూటమి ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ వేశారు. గ్రామ వికాసంలో భాగంగా పవన్ అనేక మార్పులు తెచ్చారు.
•    రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో 13326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు పెట్టారు. అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
•    రెండున్నర దశాబ్దాల తర్వాత పంచాయతీ రాజ్ వ్యవస్థలోని వివిధ హోదాల్లో ఉన్న 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు.
•    15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4136 కోట్లు విడుదల చేశారు.. లక్షకు పైగా పంటకుంటలు తవ్వించారు... పశువుల కోసం నీటి తొట్టేలు కట్టించారు.
•    పంచాయతీ రాజ్ శాఖ 13 జాతీయ అవార్డులు దక్కించుకుంది.
•    పవన్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ పేదల కోసం పని చేస్తోంది.
•    పొట్టి శ్రీరాములు జల ధార కింద జేజేఎం పనులు ప్రారంభించబోతున్నాం. 
•    ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్ వేస్తున్నాం.
•    రోడ్ల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
•    పట్టణ ప్రాంతాల్లో రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం.
•    నాటి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లల్లో 880 కిలోమీటర్ల సీసీ రోడ్లను మాత్రమే వేశారు.
•    కూటమి ప్రభుత్వం రెండేళ్లల్లో 6500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసి చరిత్ర సృష్టించాం.
•    అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు వైఎస్సార్ పార్టీ దొంగల జేబుల్లోకి వెళ్లాయి.
•    ఇప్పుడు ప్రజల కళ్లకు కనబడేలా అభివృద్ధి చేస్తున్నాం