పల్లె పండుగతో అభివృద్ధికి కొత్త ఊపిరి
పల్లె పండగతో గ్రామాల్లో అభివృద్ధికి కొత్త ఊపిరి ఎంపీ, ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కర్నూల్ ఎంపీ బస్తిపాడు నాగరాజు, ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిలు పేర్కొన్నారు.
పల్లెపండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కందనాతి, కడివెళ్ల, గాజులదిన్నె గ్రామాల్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే డా. బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు.
గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే పల్లెపండుగ–3.0 లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గాజులదిన్నె గ్రామంలో స్వర్ణ సచివాలయం, మినీ గోకులం షెడ్‌ను ఎమ్మెల్యే, ఎంపీలు ప్రారంభించారు.
పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ఎమ్మెల్యే, ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు.