BREAKING
కాకొల్లువారిపల్లెలో పల్లె పండుగ పనులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం ఆగమ సలహాదారుకి పార్థసారథి భట్టాచార్య పురస్కారం అంగన్వాడి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు! గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం జిల్లాస్థాయి ఆటల్లో మెరిసిన బాలికలు దూరవిద్య తో ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు . ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ గుణకనపల్లె లో పారిశుద్ధంపై ఎంపీడీవో ప్రత్యేక పర్యవేక్షణ రాయలసీమ అభివృద్ధి లక్ష్యం... -గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ గా లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర అభివృద్ధి ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘన సత్కారం భారీ వర్షాలతో పుచ్చకాయ పంటకు నష్టం 22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు - పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు

టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం!

Select Suryaa Now
టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు టార్జాన్ అలియాస్ ఎదిరె లక్ష్మినారాయణ గుప్తా ఇంట ప్రస్తుతం ఆనందాల హేమం కొనసాగుతోంది. వర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘గాయం’తో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఆ తర్వాత వందలాది సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆయన తన కుటుంబంలోకి కొత్త అతిథిగా వచ్చిన ముద్దుల మనవరాలిని అత్యంత వైభవంగా ఇంటికి ఆహ్వానించారు.

ఇంటికి వచ్చిన తన మనవరాలికి ఘనస్వాగతం పలుకుతూ టార్జాన్ కుటుంబ సభ్యులు నివాసాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మా ఇంటి మహాలక్ష్మికి సాదర స్వాగతం అంటూ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ అరుదైన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు చిన్నారికి దీవెనలు అందజేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకునే టార్జాన్ దంపతుల ఆనందాన్ని చూసి అందరూ మురిసిపోతున్నారు.