BREAKING
రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా ‘రామాయణం’ స్పెషల్ బీటీఎస్ గ్లింప్స్ విడుదల! మల్లేశ్వరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహోత్సవం పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Select Suryaa Now
మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

సూర్య తెలంగాణ డెస్క్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారంలో ప్రముఖ సినీ నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న వీరిద్దరూ తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తమ తులాభారంతో పాటు నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) కానుకగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ పనుల నేపథ్యంలో ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వనదేవతల ఆశీస్సులు తీసుకునేందుకు నానితో కలిసి శ్రీకాంత్ ఓదెల మేడారానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు వీరికి సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన మేడారం మహాక్షేత్రాన్ని దర్శించుకున్న ఈ సినీ ప్రముఖులను చూసేందుకు స్థానిక అభిమానులు, భక్తులు భారీగా తరలివచ్చారు. దైవ దర్శనం అనంతరం వారు తిరిగి ప్రయాణమయ్యారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మేడారాన్ని సందర్శించి వనదేవతల మొక్కులు తీర్చుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.