BREAKING
కాకొల్లువారిపల్లెలో పల్లె పండుగ పనులను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం ఆగమ సలహాదారుకి పార్థసారథి భట్టాచార్య పురస్కారం అంగన్వాడి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు! గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం జిల్లాస్థాయి ఆటల్లో మెరిసిన బాలికలు దూరవిద్య తో ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు . ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ గుణకనపల్లె లో పారిశుద్ధంపై ఎంపీడీవో ప్రత్యేక పర్యవేక్షణ రాయలసీమ అభివృద్ధి లక్ష్యం... -గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ గా లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర అభివృద్ధి ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘన సత్కారం భారీ వర్షాలతో పుచ్చకాయ పంటకు నష్టం 22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు - పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు

సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి

Select Suryaa Now
సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి

 

వేతనాలు, పెన్షన్, కార్మిక హక్కుల సమస్యలను పరిష్కరించాలి: సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్

తిరుపతి : సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించానీ సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ బ్యాంక్ చైర్మన్ సదాశివరెడ్డి తెలిపారు. మంగళవారం  సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తిరుపతి క్యారేజీ రిపేర్ షాప్ (సీఆర్‌ఎస్) మెయిన్ గేట్ వద్ద ప్రొటెస్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్, ఉద్యోగ భద్రత, ఇన్సెంటివ్‌లు, కార్మిక హక్కులు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనియన్ నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సి.హెచ్. శంకర్రావు, జోనల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ జి.ఎన్. శ్రీనివాసరావు, వర్క్‌షాప్ డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ ఎం.వి.ఎం. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, వర్క్‌షాప్ డివిజన్ ప్రెసిడెంట్, బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ కాళహస్తి బాబు, బ్రాంచ్ చైర్మన్,  ఎడియస్ కామ్రేడ్ కే. సదాశివరెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సదాశివరెడ్డి, కాళహస్తి బాబు, మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం, రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కులు, మెరుగైన పని పరిస్థితుల కోసం యూనియన్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు.

ప్రధాన డిమాండ్లు

8వ వేతన సంఘం తన సిఫార్సులను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి, 01 జనవరి నుంచి 3.86 ఫిట్‌మెంట్ ఫార్ములాను ఉద్యోగులు, పింఛనుదారులందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా ఎన్పీఎస్, యుపిఎస్ NPS, UPS విధానాలను నిలిపివేసి పాత పెన్షన్ విధానం ను అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.అన్ని విభాగాల్లోని టెక్నీషియన్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టులను విలీనం చేయాలని, ఉత్పాదకతతో అనుసంధానించిన బోనస్‌ను ₹21,000 సీలింగ్‌తో చెల్లించాలని కోరారు. అన్ని కేటగిరీల్లో  క్యాడర్ రీ-స్ట్రక్చరింగ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ ను ప్రస్తుత 10 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని, రైల్వేలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను రద్దు చేయాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు.రైల్వే ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రీవిలేజ్ పాస్‌తో పాటు వైద్య సౌకర్యం కల్పించాలని, సీఆర్‌ఎస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఆర్‌ఎస్ కార్మికులకు న్యాయం జరిగేలా అన్ని షాపుల్లో 50 శాతానికి తగ్గకుండా ఇన్సెంటివ్ అమలు చేయాలని కోరారు.ఈ సమస్యలను ప్రభుత్వం, రైల్వే యాజమాన్యం తక్షణమే పరిష్కరించకపోతే కార్మికుల ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు పేర్కొన్నారు.

భారీగా పాల్గొన్న యూనియన్ నాయకులు, కార్యకర్తలు

ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ ట్రెజరర్ ముని కుమార్, ఎడియస్  మునిరాదయ్య, హేన్రి పాల్, జె డబ్ల్యూ సి మెంబర్ రంగనాథం, వైస్ చైర్మన్లు చంద్ర నాయక్, దిలీప్, దేవళం రాజేష్, గాండీవం, అసిస్టెంట్ సెక్రటరీలు సుధాకరయ్య, రామ తులసి, సిసిఎస్ డెలిగేట్లు నరేంద్ర, అరుణ్, క్యాంటీన్ డైరెక్టర్ ఏ. బాబు, యూత్ కోఆర్డినేటర్ చెంచయ్య, బిఈసి సభ్యులు, వీర మహిళా నాయకులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, యూత్ కామ్రెడ్స్, తదితరులు పాల్గొన్నారు.

యూనియన్ నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ ప్రొటెస్ట్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.