BREAKING
గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం జిల్లాస్థాయి ఆటల్లో మెరిసిన బాలికలు దూరవిద్య తో ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు . ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల వెల్లువ గుణకనపల్లె లో పారిశుద్ధంపై ఎంపీడీవో ప్రత్యేక పర్యవేక్షణ రాయలసీమ అభివృద్ధి లక్ష్యం... -గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ గా లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర అభివృద్ధి ప్రతి ఉద్యోగికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘన సత్కారం భారీ వర్షాలతో పుచ్చకాయ పంటకు నష్టం 22513 పిజిఆర్ఎస్ అర్జీలకు పరిష్కారం -- జిల్లా కలెక్టర్ కె . వెట్రి సెల్వి వెల్లడి పల్లె పండుగకు ఏర్పాట్లలో బోగోలు మండల నాయకులు - పెద్ద ఎత్తున తరలిన బోగోలు మండల ప్రజలు నాటి విధ్వంసానికి నేటి వికాసానికి తేడా చూడండి మనోవికాస కథలు పుస్తకావిష్కరణ మేము పేదలకు పట్టాభిషేకం చేస్తుంటే వాళ్లు రక్తాభిషేకం అంటున్నారు

ఎక్కడ సమస్య ఉన్న ముందుంటా వైయస్ మనోహర్ రెడ్డి

Select Suryaa Now
ఎక్కడ సమస్య ఉన్న ముందుంటా వైయస్ మనోహర్ రెడ్డి

ఎక్కడ సమస్య ఉన్నా ముందుంటా – వైఎస్ మనోహర్ రెడ్డి

పులివెందుల మేజర్ న్యూస్:

మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకొస్తే, సమస్య పరిష్కారానికి ముందుండి కృషి చేస్తానని మున్సిపల్ ఇన్‌చార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి తెలిపారు.
స్థానిక బయమ్మ తోట కాలనీలో బోర్ మోటార్ కాలిపోవడంతో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. అవసరమైన చర్యలు చేపట్టి బోర్ మోటార్ సమస్యను పరిష్కరించి, కాలనీ ప్రజలకు నీటి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు.
అదేవిధంగా కాలనీలో చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రావడం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజల కనీస అవసరాలు కూడా సకాలంలో తీరని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ప్రజలు ఏ సమస్యనైనా తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడటంతో పాటు, అవసరమైన సందర్భాల్లో ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎంపీ నిధులతో, అవసరమైతే సొంత నిధులతోనైనా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు హాల్ గంగాధర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు పార్నపల్లి కిషోర్, వైఎస్సార్‌సీపీ నాయకులు శేఖర్, సుభాష్, హరి తదితరులు పాల్గొన్నారు.