ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం*
*ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం*
ఉమ్మడి ఖమ్మం, సూర్య బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ, సెప్టెంబర్ 29:
ఖమ్మం అర్బన్ పరిధిలోని ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా ఇన్‌స్పెక్టర్ మేడిపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు పోలీస్ శాఖ అధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటివరకు ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్. భానుప్రకాశ్‌ను హైదరాబాద్‌లోని మల్టీజోన్–1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
మేడిపల్లి నాగరాజు ప్రస్తుతం భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బదిలీలో భాగంగా ఆయనను ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. నాగరాజు మరో రెండు రోజుల్లో ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.