ప్రభుత్వ పాఠశాల ఎస్ఎంసి వైస్ చైర్మన్ గా రాజశేఖర్
రేణిగుంట: ప్రభుత్వ పాఠశాల ఎస్ఎంసి కమిటీ వైస్ చైర్మన్ పి రాజశేఖర్ ను సిఐటియు మండల కన్వీనర్ సెల్వరాజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐటియు రేణిగుంట మండల కన్వీనర్ సెల్వరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన ప్రభుత్వ పాఠశాల ఎన్నికల్లో రేణిగుంట మండలం లో రేణిగుంట బాయ్స్ హైస్కూల్. రేణిగుంట జూనియర్ కళాశాల. తారకరామా నగర్ హెల్మెట్రీ స్కూల్. తారక రామా నగర్ హై స్కూల్ లో రేణిగుంట మండలంలో వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తారక రామానగర్ హై స్కూల్ వైస్ చైర్మన్ గా పి రాజశేఖర్ ఎన్నుకోవడం జరిగింది.
తారకరామ నగర్ ఎలిమెంటరీ స్కూల్ వైస్ చైర్మన్గా ఉమా
ఎలిమెంటరీ స్కూల్ ఎస్ఎంసి కమిటీ మొత్తం 15 మంది రాజశేఖర్, హరి రాజా, అంజలి,వరలక్ష్మి,నాగవేణి,రామానుజనేయులు,వెంగల్ రెడ్డి,అమరావతి వినోద్, రామంజి,అంజలి,రంగవేణి,ధరణి, అయేషా,ముంతాజ్ ఎన్నికైన వారందరికీ సెల్వరాజ్ అభినందనలు తెలిపారు.