BREAKING
పల్లె పండుగతో అభివృద్ధికి కొత్త ఊపిరి కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం… గట్కా క్రీడలో పందలపాక విద్యార్థుల ప్రతిభ: రాష్ట్రస్థాయి పోటీలకు 8 మంది ఎంపిక రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం

వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ

Select Suryaa Now
వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ

వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ 

​నెల్లూరు, , మేజర్ న్యూస్:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా మంగళవారం రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ , వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

​ఈ సందర్భంగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్  మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన వెంకటగిరి పోలేరమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఆత్మీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ  ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే రైల్వేకోడూరు – వెంకటగిరి రోడ్డు విస్తరణ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

​అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ  మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన పోలేరమ్మ జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషకరమని, ఇరు నియోజకవర్గాల అభివృద్ధికి, అనుసంధాన రహదారుల పూర్తికి కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో AMC చైర్మన్, పట్టణ అధ్యక్షులు, AMC మాజీ అధ్యక్షులు, పోలేరమ్మ జాతర సేవా కమిటీ అధ్యక్షులు, వెంకటగిరి PACS అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, పోలేరమ్మ దేవస్థాన ఈఓ, జనసేన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు