పరిగి లో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.…
ఎంజేపి బీసీ బాలికల హాస్టల్, ఎస్ఐఆర్ ప్రక్రియ,ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ
నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిశీలన
పరిగి. మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29). వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మంగళ వారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ ప్రయాణంలో పట్టణంలోని
మంగళవారం పరిగి మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ హాస్టల్‌ను, ప్రభుత్వ ఆసుపత్రి, ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటశాలను పరిశీలించి, వంట సామగ్రి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ప్రతిరోజూ అమలు చేస్తున్న మెనూ వివరాలను పరిశీలించారు. మెనూ బోర్డును తనిఖీ చేసి, నిర్ణీత మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను సూచించారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మాధవరెడ్డిని హాస్టల్‌కు సంబంధించిన నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో సుమారు 450 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రిన్సిపల్ కలెక్టర్‌కు వివరించారు.
విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఇతర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులకు డ్రెస్సులు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. వారి చదువు, విద్యా ప్రగతి గురించి ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల స్టడీ మెటీరియల్‌ను పరిశీలించి, వారిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుకునేలా ప్రోత్సహించాలని, పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాస్టల్‌లోని లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థుల విశ్రాంతి గదులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం. పరిగి మున్సిపల్ లో ఎస్ ఐఆర్ ఓటరు సవరణ నోటీసులపై జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
హనుమాన్ మందిరం సమీపంలోని పీఎస్ నంబర్లు 210, 211, 212, 213 ఎస్ఐఆర్ సమగ్ర ఓటరు సవరణకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రియను బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సంబంధిత బీఎల్‌ఓలను నోటీసుల జారీ, పెండింగ్‌లో ఉన్న నోటీసులు, ఓటర్లకు నోటీసులు అందించిన తీరుపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.అక్కడే ఉన్న ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేసిన ఇళ్లను పరిశీలించి, ఇంటి యజమానులను నోటీసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసే నోటీసులను సక్రమంగా అందజేసి, సంబంధిత వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బీఎల్ఓలకు సూచించారు.
తధనంతరం
నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంక్‌ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నిర్మాణ నాణ్యత, పనుల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనులకు సంబంధించిన మిగతా వివరాలను మున్సిపల్ కమిషనర్ మల్లేశంను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
వాటర్ ట్యాంక్‌ల నిర్మాణ పనులను నిర్ణీత ప్రమాణాలతో, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మున్సిపల్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ల్యాబ్, ఎక్స్‌రే రూమ్‌లను పరిశీలించి, వాటి వినియోగం, అందుతున్న సేవల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు వినియోగించే మందులను పరిశీలించి, మందుల నిల్వలు, స్టాక్ వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్ష కేంద్రం, బ్లడ్ బ్యాంక్ స్టోర్ రూమ్, మందుల నిల్వ గది, ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ విభాగం, ఐసీయూలను పరిశీలించారు. ఆసుపత్రిలోని మహిళలు, పురుషుల వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
అలాగే రోగులకు వండుతున్న ఆహార పదార్థాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రోగులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ఆసుపత్రిలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లాకలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవరెడ్డి, ఆర్డీవో వాసు చంద్ర, ప్రిన్సిపల్ సౌజన్య,
మున్సిపల్ కమిషనర్
మల్లేశం, తహసిల్దార్ వెంకటేశ్వరి,
ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజశేఖర్,
సంబంధిత అధికారులు పాల్గొన్నారు.రిపోర్టర్ మంగలి ప్రకాష్ కుమార్.