BREAKING
విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా ఖాన్‌పురా ఉర్దూ పాఠశాలకు నాయకుల అండ పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం సుడా చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదును ప్రారంభించిన బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామ ఎంపీ పారమిత వరల్డ్ స్కూల్ లో విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన తాండూరులో జోరుగా బీసీల ఆత్మగౌరవ దీక్ష మున్సిపల్ చైర్మన్ రెసులో మోకా మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి వీడ్కోలు అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి : కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ముసుగు తొలగించాలని సర్పంచ్ కు వినతి.. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 'ప్రపంచ హృదయ దినోత్సవ' 3కె వాక్ ఖమ్మం లో అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలు ప్రారంభం

రాముడు, శివుడు అందరి ఆరాధ్య దైవాలు

Select Suryaa Now
రాముడు, శివుడు అందరి ఆరాధ్య దైవాలు


దేవుళ్లను, భక్తులను విభజించే రాజకీయాలకు స్వస్తి పలకాలి
బీజేపీ వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్
సూర్య వీణవంక: రామేశ్వరం నుంచి కేదార్‌నాథ్‌ వరకు, కాశీ నుంచి భద్రాద్రి వరకు భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాల్లో శివుడు, శ్రీరాముడు విడదీయరాని దైవ స్వరూపాలని బీజేపీ వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ అన్నారు.
శివుడు పేదల దేవుడు, శ్రీరాముడు ధనికుల దేవుడు అన్నట్లుగా మాట్లాడటం సమాజంలో విభజనకు దారితీస్తుందని, ఓట్ల కోసం దేవుళ్లు, భక్తులు, ప్రాంతాల మధ్య చీలికలు సృష్టించే రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన అన్నారు. తెలంగాణలో భద్రాద్రి శ్రీరాముడు, శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న క్షేత్రాలు ప్రజలందరి విశ్వాసాలకు కేంద్రాలుగా ఉన్నాయని పేర్కొన్నారు.
కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. దక్షిణాది–ఉత్తరాది, ద్రావిడ–ఆర్య వంటి విభజన చర్చలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మధ్య విభజనకు దారితీసే వ్యాఖ్యలకు బదులుగా తెలంగాణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని నరేష్ గౌడ్ సూచించారు. దేవుళ్లను రాజకీయాలకు ఉపయోగించకుండా దేవాలయాలు, భక్తుల విశ్వాసాలను గౌరవించడమే నిజమైన ప్రజాసేవ అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి సీహెచ్ నరసింహ రాజు, మండల జనరల్ సెక్రటరీలు ఉడుత కుమార్, ముత్యాల రవీందర్, సర్పంచ్ దాట్ల వీరస్వామి, మారం తిరుపతిరెడ్డి, మండల కార్యదర్శి కర్రె నాని, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అప్పని కొమురయ్య, బీజేవైఎం మండల అధ్యక్షుడు దండు హరికృష్ణ, దామోదర్, బూత్ అధ్యక్షులు అశోక్, కంకల సంతోష్, కర్ర రమణారెడ్డి, చేతి వెంకటేశ్వర్లు, రవి, రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.