BREAKING
రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా ‘రామాయణం’ స్పెషల్ బీటీఎస్ గ్లింప్స్ విడుదల! మల్లేశ్వరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహోత్సవం పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం

కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 'ప్రపంచ హృదయ దినోత్సవ' 3కె వాక్

Select Suryaa Now
కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 'ప్రపంచ హృదయ దినోత్సవ' 3కె వాక్

కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతంగా 'ప్రపంచ హృదయ దినోత్సవ' 3కె వాక్

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 29న నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు 3 కిలోమీటర్ల వాక్ ఘనంగా జరిగింది. వీఆర్సి గ్రౌండ్స్ నుంచి దర్గామిట్టలోని కిమ్స్ హాస్పిటల్ వరకు సాగిన ఈ ర్యాలీని ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ మహిళా స్క్వాష్ క్రీడాకారిణి అపరాజిత, జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 500 మందికి పైగా వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా అందరూ 30 నిమిషాల పాటు జుంబా నృత్యం చేశారు. అనంతరం సిబ్బంది అంతా హృదయాకారంలో నిలబడి బెలూన్లు ఎగురవేసి, అంబులెన్సుల ర్యాలీతో "కదలిక లేనిదే గుండెకు మనుగడ లేదు" అనే నినాదాలతో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కిమ్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస రాజు, ఇతర సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ డి. సాహెబ్ వీర్, డాక్టర్ హెచ్. నాగరాజ రావు, డాక్టర్ పి. లోకేశ్వర రావు తదితరులు మాట్లాడుతూ.. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి నివారణ ఎంతో అవసరమని స్పష్టం చేశారు. పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోవాలని, బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కిమ్స్ ఆసుపత్రికి చెందిన పలువురు సీనియర్ వైద్యులు, విభాగాధిపతులు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ వంచి, డాక్టర్ రోహిణి ప్రియ లక్ష్మి వంటి మేనేజ్మెంట్ ప్రతినిధులు, విఆర్సి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ వాక్‌లో పాల్గొని "ఆరోగ్యకరమైన హృదయం - ఆరోగ్యకరమైన జీవితం" అనే సందేశాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు