విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి
- కౌన్సిలర్ పాపిశెట్టి రాము
విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించుకోవాలని ఐదవ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము సూచించారు. మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్నిచంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.శిబిరాన్ని లయన్స్ క్లబ్ సభ్యుడు, 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీలు చూడటం తగ్గించి, కంటిని కాపాడుకోవాలని కోరారు. కొంతమంది విద్యార్థులకు దృష్టిలోపంతో చూపు సరిగా కనిపించక ఇబ్బందికి గురవుతున్నారన్నారు. విద్యార్థులు కంటి సమస్యలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారి కోసం ఉచితకంటి వైద్య శిబిరా లలో అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ కళ్ళను సుచి, శుభ్రత పాటించాలని కండ్లు బాగుంటేనే ప్రపంచంలో ఏదైనా చూడగలుగుతామని అన్నారు. విద్యార్థుల్లో చిన్న వయసులోనే కంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా గుర్తించి చికిత్స అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం స ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని క్లబ్ పిఆర్ఓ పాషా తెలిపారు. శిబిరంలో 180 మంది విద్యార్థులకు కంటి వైద్యులు ఎం చంద్రశేఖర్ కంటి పరీక్షలు నిర్వహించగా 15 మందికి అద్దాలు అవసరం ఉందని గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు మధుకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- ఏ చంద్రశేఖర్ : మేజర్ న్యూస్, ఆమనగల్లు.