BREAKING
ఎయిర్‌పోర్టు ఉద్యోగాలంటూ టోకరా! గంగలకుర్రు నిమజ్జన ఘర్షణల్లో అక్రమ కేసులు.. బాధితులకు న్యాయం చేయాలి :వైఎస్ జగన్‌కు వినతి ​గ్రామాల పరిశుభ్రత అందరి బాధ్యత: ఎంపీడీవో జి. శంకర జగన్నాథం స్వచ్ఛ రథంతో పరిశుభ్రతపై అవగాహన ​అధిక వర్షాల వేళ పత్తి పంట సంరక్షణపై ర చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలపై రేపే తీర్పు.. నోటిఫికేషన్‌పై ఉత్కంఠ ప్రతీ గ్రామం పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథంతో వ్యర్థాలు సేకరణ "ఎంపిడిఓ " కొత్తూరులో రూ.1.13 కోట్లతో నాలుగు శ్మశాన వాటికలు జిల్లేడు ద్రావణంతో ప్రకృతి వ్యవసాయానికి బలం పాలమూరు రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించిన కలెక్టర్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాలనటి సారా పాలేకర్ ఆసక్తికర విశేషాలు పోషకాహారంతోనే చిన్నారుల సంపూర్ణ వికాసం యూనియన్ బలోపేతానికి మరింత కృషి చేయాలి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. టైరు పేలి బోల్తా పడిన డీసీఎం వ్యాన్ కలుపుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

మున్సిపల్ వార్డు కార్యాలయాలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ తనూజ

Select Suryaa Now
మున్సిపల్ వార్డు కార్యాలయాలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ తనూజ

మున్సిపల్ వార్డు కార్యాలయాలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ తనూ జ


పులివెందుల మేజర్ న్యూస్ :

మున్సిపల్ కమిషనర్ శ్రీమతి తనూజ గారు మంగళవారం పట్టణంలోని పలు వార్డు కార్యాలయాలను తనిఖీ చేసి, అక్కడి రికార్డులను పరిశీలించారు. కార్యాలయాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ తీరును సమీక్షించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
పట్టణంలోని వార్డు కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల నిర్వహణలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ తనూజ సూచించారు.