BREAKING
పల్లె పండుగతో అభివృద్ధికి కొత్త ఊపిరి కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం… గట్కా క్రీడలో పందలపాక విద్యార్థుల ప్రతిభ: రాష్ట్రస్థాయి పోటీలకు 8 మంది ఎంపిక రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి

Select Suryaa Now
కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి

చెన్నూరు మేజర్ న్యూస్: 

ఓటర్ల జాబితా సవరణలో (ఎస్‌ఐఆర్‌) జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరే విధంగా ఓటర్ల జాబితా రూపొందించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని పార్టీలకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించడం సరికాదన్నారు.ఓటర్ల జాబితా సవరణలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనల్లో తామంతా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్ స్పందించి, ఓటర్ల జాబితా సవరణలో జరిగిన అవకతవకలపై సమగ్రంగా విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.