పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి.
పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి.
మునుగోడు,మేజర్ న్యూస్:
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు పారదర్శకంగా ఉచితంగా సన్నబియ్యం అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని చేపట్టిందని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక రైతువేదికలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లుగా పరిపాలన చేసి ఏ ఒక్క నిరుపేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు తహశీల్దార్ నరేష్, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి, ఓబీసీ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, ఆయా గ్రామాల సర్పంచులు పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్,బొల్లం రమేష్, మాలుగు శ్రీను,చీమల రాజు యాదవ్,జాల జంగయ్య యాదవ్, జంగిలి సునీత సాంబయ్య, నన్నూరి భూపతి రెడ్డి, జిట్టగోని సైదమ్మ సైదులు,జీడిమడ్ల నిర్మల దశరథ, బండమీద యాదయ్య,కొండ శ్రీను,అందుగుల నర్సమ్మ, తీర్పారి నాగమణి ఆంజనేయులు,పలివెల గ్రామ శాఖ అధ్యక్షుడు అనగంటి కృష్ణ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.