BREAKING
పల్లె పండుగతో అభివృద్ధికి కొత్త ఊపిరి కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం… గట్కా క్రీడలో పందలపాక విద్యార్థుల ప్రతిభ: రాష్ట్రస్థాయి పోటీలకు 8 మంది ఎంపిక రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం

వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్.

Select Suryaa Now
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్  ప్రతిమాసింగ్.

 

వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం

జిల్లాలో 518 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

గ్రేడ్ ఏ ధాన్యానికి - 2461
కామన్ రకానికి-  2441

07 రకాల సన్న వెరైటీ విత్తనాలకు 
500 రూపాయల బోనస్

మిల్లర్ల సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సవ్యంగా నిర్వహణ

కేంద్రాల్లో అన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు

జిల్లా కలెక్టర్  ప్రతిమాసింగ్.

మెదక్ ;  ఖరీఫ్ (వానాకాలం) సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లతో  సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్  ప్రతిమాసింగ్ అధికారులను  ఆదేశించారు.మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి కాన్ఫరెన్స్ హాల్లో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, డీఆర్‌డీఓ, రవాణా, పోలీస్ శాఖల అధికారులతో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ కలిసి కలెక్టర్  సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను సంసిద్ధంగా తయారు చేసినట్లు చెప్పారు. 2026-27 సంవత్సరానికి గాను జిల్లాలో 03  లక్షల 20వేల హెక్టార్లలో 
రైతులు వరి సాగు చేసినట్లు అంచనా వేసినట్లు వివరించారు. దొడ్డు రకం -413, సన్న రకం-105 కేంద్రాలు మొత్తం 518 కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేస్తున్నట్లు గ్రేడ్ ఏ ధాన్యానికి-2461, సాధారణ రకం-2441 ధర నిర్ణయించినట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఐకేపీ  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం-300 , సహకార మార్కెటింగ్ సొసైటీ -12 (ఎఫ్ పి ఓ ) ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్- రైతు ఉత్పత్తిదారుల సంస్థ). ఆధ్వర్యంలో -32 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారురాష్ట్రంలో ప్రోత్సాహం కోసం ఏడు ప్రాధాన్య వరి రకాలను 
గుర్తించామన్నారు. బిపిటి  5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటి  సోనా,జై శ్రీరామ్ , కెఎన్ఎం 1638, డబ్ల్యూ జి యల్  44,కెఎన్ఎం 7715. వివిధ రకాల సన్న రకం వడ్ల బోనస్ లపొందుపరిచినట్లు తెలిపారు టార్పాలిన్లు-14353, ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్స్-06, తేమ కొలిచే యంత్రాలు-655, అందుబాటులో ఉంచామన్నారు, గన్ని బ్యాగ్స్ -51 లక్షల 75000 ఉన్నాయన్నారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు ప్రభుత్వాదేశాల మేరకు తీసుకునే విధంగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదనంగా ఉన్న ప్యాడిని ఇంటర్మీడియట్ గోడౌన్లో స్టోరేజ్ చేస్తున్నట్లు తెలిపారు.రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్నారు.ధాన్యం రవాణా చేసే లారీలకు నిబంధనల ప్రకారం ఖచ్చితంగా జీపీఎస్ (లేదా) వాహన స్థాన నిర్ధారణ వ్యవస్థను అమర్చాలని, తద్వారా ధాన్యం మళ్లింపును అరికట్టవచ్చని అన్నారు. అలాగే వరికోత మిషన్లను ముందస్తుగా పరిశీలించి, వాటి ఫిట్‌నెస్, భద్రతను సరిచూడాలని రవాణా శాఖ అధికారులకు స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, తగినన్ని గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ట్రక్కుల్లో లోడింగ్, అన్‌లోడింగ్ చేయడంలో సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ముందస్తుగా క్షేత్రస్థాయిలో గోదాములను పరిశీలించాలని, వాటి సామర్థ్యాన్ని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.అలాగే మహిళా సంఘాల సభ్యులతో ముందస్తుగా సమావేశాలు నిర్వహించి, వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని, కొనుగోలు కేంద్రాల నిర్వహణ సాఫీగా సాగేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను విజయవంతంగా చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ,డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సహకార శాఖ అధికారి పద్మ, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్ ,రవాణా శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.