BREAKING
పల్లె పండుగతో అభివృద్ధికి కొత్త ఊపిరి కొత్తపట్నం మండలంలో SMC ఎన్నికల కార్యక్రమం… గట్కా క్రీడలో పందలపాక విద్యార్థుల ప్రతిభ: రాష్ట్రస్థాయి పోటీలకు 8 మంది ఎంపిక రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన వీఆర్ఏలు గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు టార్జాన్ ఇంట ఘనంగా వేడుక.. ముద్దుల మనవరాలికి స్వాగతం! కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల సంచలన వ్యాఖ్యలు! సిఆర్ఎస్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి…………బ్రాంచ్ చైర్మన్ సదాశివరెడ్డి ఖానాపురం హవేలీ ఎస్ హెచ్ ఓ గా నాగరాజు నియామకం* చిరు వ్యాపారులకు న్యాయం చేయండి సతీమణి స్నేహారెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్‌డే విషెస్! హార్స్లీ హిల్స్‌లో హోరెత్తించిన కరాటే చిన్నారులు! కళాకారులకు బిజెపి నేతల సన్మానం ‘ఏమో ఏమో ఇది’ అంటూ మంత్రముగ్ధులను చేస్తున్న రోషన్ మేక రొమాంటిక్ టైటిల్ సాంగ్! వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రైడ్ హార్ట్ హాస్పిటల్‌లో ప్రత్యేక కార్యక్రమం

దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే..

Select Suryaa Now
దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే..

దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే..
- లేదంటే టిఆర్ఎస్ తరఫున ఇక కోట్లాడుడే...
- గత ప్రభుత్వం ఇఛ్చిన డివిజన్ ను అడ్డుకునే కుట్ర చేస్తున్న ఎమ్మెల్యే
- సంక్షేమ పథకాలు ఎగ్గొట్టినట్టుగా.. డివిజన్ ఎగ్గొట్టే ప్రయత్నం
- విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, కుల సంఘాలతో కలిసి పోరాటం
– మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి

రామాయంపేట ; రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, దసరా పండుగలోపు డివిజన్‌ను పునరుద్ధరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ , బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దసరా అనంతరం అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆమె హెచ్చరించారు. మంగళవారం రామాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో రామాయంపేట ప్రజల డిమాండ్‌ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, రామాయంపేటకు రెవెన్యూ డివిజన్‌, డిగ్రీ కళాశాల మంజూరయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్ల నిధులు కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు.

గెజిట్‌ వచ్చినా.. కార్యాలయం మూత
రామాయంపేట, నార్సింగి, శంకరంపేట, నిజాంపేట మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ జారీ కావడంతో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువడిందని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆర్డీఓ బాధ్యతలు స్వీకరించి కొంతకాలం కార్యాలయం కూడా కొనసాగిందన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినదనే కారణంతో రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేసి ఆర్డీఓ కార్యాలయానికి తాళం వేశారని ఆరోపించారు. ప్రస్తుతం కూడా ఆ కార్యాలయానికి ఆర్డీఓ కార్యాలయం పేరుతోనే విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని తెలిపారు.

పథకాల మాదిరిగానే డివిజన్‌పైనా నిర్లక్ష్యం
గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునే రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ విషయంలోనూ అవలంబిస్తోందని పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. రాజకీయ కారణాలతో ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. డివిజన్‌ ఏర్పాటుతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు.రామాయంపేట ప్రజల ఆకాంక్షను గౌరవించి దసరా పండుగలోపు రెవెన్యూ డివిజన్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి గడువు ఇస్తున్నట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. అప్పటిలోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే దసరా అనంతరం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, వివిధ కుల సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదే చంద్రం, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్టి విజయలక్ష్మి, బీఆర్ఎస్‌ నాయకులు చౌదరి సుప్రభాతరావు, చంద్రపు కొండల్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌, ఎండీ హస్నుద్దీన్‌, శ్రీకాంత్‌ సాగర్‌, బసన్నపల్లి రాజు యాదవ్‌, పోచమ్మల ఐలయ్య, దోమకొండ శ్రీను, దత్తు సాగర్‌, కన్నాపురం కృష్ణగౌడ్‌, రొయ్యల నవీన్‌, మద్దెల రమేష్‌, భూమ మల్లేషం, పుట్టి సిద్ధరాములు, బసన్నపల్లి శ్రీనివాస్‌, కన్నాపురం సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.