BREAKING
రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా ‘రామాయణం’ స్పెషల్ బీటీఎస్ గ్లింప్స్ విడుదల! మల్లేశ్వరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహోత్సవం పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం

అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి : కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

Select Suryaa Now
అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి  చేయండి : కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

రైల్వే ప్రాజెక్ట్, భూసేకరణ, జాతీయ రహదారులు పనులు సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికభద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ సేకరణ పనులపై జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డిఆర్ఓ జి.నరసింహులుతో కలసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి టూరిజం ఆర్ డి రమణ ప్రసాద్, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ జనార్థన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భారత్ నాయక్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మీ, తహశీల్దార్లు, శ్రీసిటీ గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేణిగుంట-గూడూరు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి - కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జాతీయ రహదారులు, ఏపిఐఐసి సూళ్ళూరుపేట, సత్యవేడు, ఫేజ్ -2 నాయుడుపేట, అపోలో టైర్ లు, దుగ్గరాజు పట్నం పోర్ట్ పనులు, కాళహస్తి గుంట టిటిడి పనులు, శ్రీకాళహస్తికి సంబంధించి జాతీయ రహదారి పనులు, వరదయ్యపాలెం రోడ్డు పనులు పై చర్చించి భూ సేకరణ వేగవంతం చేసి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ అనంతరం భూ పరిహారాలను త్వరితగతిన పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. 

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి