BREAKING
రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా ‘రామాయణం’ స్పెషల్ బీటీఎస్ గ్లింప్స్ విడుదల! మల్లేశ్వరం అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ్ మహోత్సవం పల్లె పండుగ-3.0 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విద్యార్థులు ఫోన్ వాడకం తగ్గించాలి వెంకటగిరి పోలేరమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఆరవ శ్రీధర్, కురుగొండ్ల రామకృష్ణ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రక్రియకు సంసిద్ధం.జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్. పారదర్శకంగా సన్నబియ్యం అందించేందుకే స్మార్ట్ కార్డులు: ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి. దసరాలోపు రామాయంపేట డివిజన్‌ చేయాల్సిందే.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి నేటి నుంచి సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ ఒంగోలులో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదును ప్రారంభించిన బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామ ఎంపీ

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదును ప్రారంభించిన బిఆర్ఎస్ మాజీ ఎంపీ నామ ఎంపీ

--గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మాజీ ఎంపీ నామ శ్రీకారం

--కుటుంబ సభ్యుల వివరాలు నమోదుతో గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభించిన - మాజీ ఎంపీ నామ

--గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై నామ ప్రత్యేక దృష్టి - మాజీ ఎంపీ నామ

--అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటర్లుగా నమోదు కావాలి - మాజీ ఎంపీ నామ

ఖమ్మం,సూర్య (మేజర్ న్యూస్): వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఓటర్ల నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఖమ్మంలోని తన క్యాంప్ కార్యాలయంలో ముందుగా తన కుటుంబ సభ్యుల గ్రాడ్యుయేట్ వివరాలను నమోదు చేయించారు. నామ సతీమణి చిన్నమ్మ, కుమారులు పృథ్వి తేజ, భవ్య తేజ ల తో పాటు కమ్మ రవి, కమ్మ జ్యోత్స్న, కిలారి ఉదయ్, రమ్యకృష్ణ, నామ సాయిరాం, కావ్య, రవీందర్, ప్రసన్న కుమారి తదితర 15 మంది కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయించారు. అనంతరం పలువురు గ్రాడ్యుయేట్ల వివరాల నమోదుకు శ్రీకారం చుట్టారు.  కార్యక్రమంలో భాగంగా సుమారు 30 మంది గ్రాడ్యుయేట్ల వివరాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్‌ ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన సహకారం అందించాలని తెలిపారు.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు కీలకమైనందున అర్హులైన పట్టభద్రులందరి వివరాలను సేకరించి నమోదు చేయించే దిశగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని నామ సూచించారు. ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్రాడ్యుయేట్లను సంప్రదించి, నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని తెలిపారు.  ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో నామ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడువు లోపు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టి, అర్హులైన వారందరి వివరాలను నమోదు చేయించాలని నామ సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా టీం ఈ ఎన్‌రోల్మెంట్ డ్రైవ్‌లో చురుగ్గా పాల్గొని, అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌తో దరఖాస్తు చేయించాలని నామ సూచించారు.