పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం
Press Release
పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం
= టంగుటూరు మండలం శివపురంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
సూర్య టంగుటూరు :
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. పల్లె పండుగ 3.0 లో భాగంగా టంగుటూరు మండలం శివపురంలో NH 16 నుండి నాయుడుపాలెం రోడ్డు వరకు వయా శివపురం మీదుగా రూ.1 కోటి 95 లక్షలతో నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణానికి మంగళవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ...పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో 13 కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో (2018 ఫిబ్రవరిలో) ఏషియన్ బ్యాంకు నుంచి పనులు తీసుకొచ్చామని, కానీ గత వైసీపీ అసమర్థ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంత ప్రజలు రోడ్ల నిర్మాణానికి నోచుకోలేదన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారాంలోకి వచ్చాక మళ్లీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. పల్లె పండుగ 3.0 లో భాగంగా రాష్ట్రంలో రూ.11,085 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి డా. స్వామి తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కి ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
*పల్లె పండుగ 3.0 లో కొండపి నియోజకవర్గంలో రూ. 24.2 కోట్లతో నిర్మించనున్న 13 కనెక్టివిటీ రోడ్ల వివరాలు*
1. రూ. 3 కోట్లతో పొన్నలూరు మండలం చెన్నిపాడు నుండి ఎదురువారిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం
2. రూ.1 కోటి 65 లక్షలతో పొన్నలూరు మండలం తిమ్మపాలెం మీదుగా శివన్న పాలెం బీటీ రోడ్డు నిర్మాణం
3. రూ. 75 లక్షలతో పొన్నలూరు మండలం చెంచుపాలెం నుండి మూలేవారిపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం
4. రూ. 85 లక్షలతో పొన్నలూరు మండలం OV రోడ్డు నుండి తేటుపేట వరకు బీటీ రోడ్డు నిర్మాణం
5. రూ. 2 కోట్ల 40 లక్షలతో పొన్నలూరు నుండి మంగపతిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం
6. రూ. 1 కోటి 90 లక్షలతో పొన్నలూరు మండలం z మేకపాడు నుండి ఓరుగంటి వారి పాలెం వరకు బీటి రోడ్డు నిర్మాణం
7. రూ. 75 లక్షలతో పొన్నలూరు మండలం మాలపాడు నుండి చెంచుపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం
8. రూ. 59 లక్షలతో సింగరాయకొండ మండలం OV రోడ్డు నుండి చినకనుమళ్ల వరకు సీసీ రోడ్డు నిర్మాణం
9. రూ. 64 లక్షలతో మర్రిపూడి మండలం అయ్యపురాజు పాలెంలో సిసి రోడ్డు నిర్మాణం
10. రూ. 3 కోట్ల 90 లక్షలతో మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం నుండి రాజుపాలెం ఎస్టీ కాలనీ - నరసింహస్వామి దేవాలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణం
11. రూ. 2 కోట్ల 22 లక్షలతో మర్రిపూడి మండలం TP రోడ్డు నుండి అయ్యవారిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం
12. రూ. 1 కోటి 95 లక్షలతో టంగుటూరు మండలం NH 16 నుండి నాయుడుపాలెం వరకు వయా శివపురం మీదుగా బీటీ రోడ్డు నిర్మాణం
13. రూ.3 కోట్ల 60 లక్షలతో టంగుటూరు మండలం కారుమంచి నుంచి జయవరం వరకు బీటీ రోడ్డు నిర్మాణం