తాండూరులో జోరుగా బీసీల ఆత్మగౌరవ దీక్ష
16 కుల సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకుల మద్దతు
తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29):
తాండూరు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బీసీల ఆత్మగౌరవ దీక్ష మంగళవారం జోరుగా సాగింది. పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ సంఘం నేత రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షకు 16 కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు.తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. బీసీ స్మశాన వాటికకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని వారు కోరారు.ఈ సందర్భంగా బీసీ సంఘం నేత రాజ్‌కుమార్ మాట్లాడుతూ. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే స్మశాన వాటిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.దీక్షకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత రాజుగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్ తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టర్ రామచందర్.