స్థానిక అల్గునూర్ లోని పారమిత వరల్డ్ స్కూల్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, చీఫ్ ఎగ్జామినర్ కె. వసంత్ కుమార్ నేతృత్వంలో మంగళవారం ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం, కరాటే పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థులు కరాటేలోని కటా, స్పారింగ్, ఆత్మరక్షణ పద్ధతులను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వివిధ స్థాయిల బెల్ట్‌లను సాధించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. శ్రీకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. కరాటే సాధన శారీరక దారుఢ్యంతోపాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత, ధైర్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని సూచించారు. బెల్ట్‌లు సాధించిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన,వి.యూ. ఎం ప్రసాద్, కరాటే ఇన్‌స్ట్రక్టర్లు మొయినుద్దీన్, రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.