సూర్య కరీంనగర్:శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించాలని కరీంనగర్ జిల్లా బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మంకమ్మతోటలోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం అధ్యక్షుడు మాదాసు సంజీవ్ మాట్లాడారు. సుడా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు అగ్రవర్ణాలకే చైర్మన్ పదవి దక్కిందని, జిల్లాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఈసారి అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటనలో దీనిపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేందర్, జిల్లా కార్యదర్శి వాయిల రాజకుమార్, చింటూ పటేల్‌తో పాటు బీసీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.