ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రఘువీరారెడ్డి
అనంతపురం బ్యూరో
ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఘువీరారెడ్డి
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర కు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి న్యూఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని తన విలువైన విషయాలను వివరించారు. గతంలో రాష్ట్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వివరించారు.