BREAKING
సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం దాష్టికం : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫైర్‌ క్రీడా పోటీల విజేతలను సత్కరించిన గీతం లయోలా డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల దినోత్సవం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరుల సమావేశం ఒంటి కాలిపై గ్రామ సేవకుల నిరసన.. ప్రపంచ ఆహార భద్రత పై అంతర్జాతీయ సదస్సు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం... కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ కి పార్నపల్లి విద్యార్థిని ఎంపిక మడనూరు గ్రామంలో “పల్లె పండుగ 3.0” పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు,. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపి,ఎమ్మెల్యేలు 1 టౌన్‌లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి {CMRF} సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ* ఉదయగిరి నియోజకవర్గం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో--చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు కుటుంబాలను పరామర్శించిన పైలెట్ రోహిత్‌రెడ్డి విశ్రాంతికి భరోసా కావాలి.. పెన్షనర్ల మహాధర్నా ఖాన్‌పురా ఉర్దూ పాఠశాలకు నాయకుల అండ

30 తేదీ సీఎం సభను విజయవంతం చేయండి

Select Suryaa Now
30 తేదీ సీఎం సభను విజయవంతం చేయండి

-- ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, సూర్య రుద్రంగి,ఈనెల 30వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి కోరారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏం సి చైర్మన్ చెలకలు తిరుపతి మాట్లాడుతూ. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు, గ్రామాల వారీగా ప్రజలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ సభను జయప్రదం చేయాలని కోరారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీగా సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు రావడం ద్వారా సిరిసిల్ల నియోజకవర్గం తోపాటు వేములవాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షుడు అక్కినపెళ్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్, ప్యాక్స్ డైరెక్టర్లు తర్రె మనోహర్, సనుగుల గంగాధర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.