తిరుపతిలో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి ఇద్దరు పరిస్థితి విషమం
తిరుపతి నగరంలో లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డీబీఆర్ రోడ్డులో ఓ ప్రైవేట్ హోటల్ వద్ద భారీ క్రేన్ సాయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో భారీ క్రేన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో క్రేన్ కింద చిక్కుకొని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన ప్రదేశంలో అధికారులు క్రేన్ను తొలగించే పనులు చేపట్టారు.