BREAKING
అభివృద్ధి పనులను పరిశీలించిన సాని వారి పల్లి సర్పంచ్ గా శ్రీనివాసులు విజయం నేడు మూడో రోజు కిషన్ రెడ్డి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ భాగ్యనగరానికి వాన ఊరట 2026-27 సహకార రోడ్‌మ్యాప్‌కు సభ్య దేశాల ఆమోదం ఫలించిన గుకేశ్ వ్యూహం.. మూడో గేమ్ డ్రా ఫోక్సో కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష. తీవ్ర ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కుకుంటున్న ఆసియా షేర్లు ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా కేంద్ర బడ్జెట్ 2027-28 రూపకల్పనకు ముందస్తు సంప్రదింపులు పూర్తి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు రూ.127 లక్షల కోట్లకు చేరిక కమర్షియల్ లెక్కలు లేకుండా చేసిన సినిమా: ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లాంచ్‌లో నితిన్ భావోద్వేగ ప్రసంగం పాక్ సిరీస్‌పై సినీ కార్మిక సంఘం అల్టిమేటం: ఆ సిరీస్ ఆపకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్ చేస్తామని హెచ్చరిక 14వ జేడీసీసీ సమావేశంలో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన భారత్, యూఏఈ

నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా వేల్ సినిమా ట్రైలర్ లాంచ్.. వచ్చే నెలలో గ్రాండ్ రిలీజ్

Select Suryaa Now
 నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా వేల్ సినిమా ట్రైలర్ లాంచ్.. వచ్చే నెలలో గ్రాండ్ రిలీజ్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రవిచంద్ర, ఆదిత్య, అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వేల్. క్షత్రియ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. అశోక్ రాజు మరియు వై. మురళి రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగేంద్ర ఆవుల దర్శకత్వం వహిస్తున్నారు. సుందరమైన గోవా బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను మేకర్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ప్రముఖ నటుడు నాగమహేశ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్ర ట్రైలర్‌‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు మాట్లాడుతూ సినిమాపై తమలో ఉన్న అపారమైన నమ్మకాన్ని వ్యక్తపరిచారు. మిస్ ఇండియా విజైతగా నిలిచి తదనంతరం ఈ ప్రాజెక్ట్ ద్వారా నటిగా పరిచయమవుతున్న అమృత శ్రీవాత్సవ మాట్లాడుతూ, మంచి కంటెంట్ ఉన్న ఈ చిత్రంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ అందిస్తున్న సంగీతం మరియు నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని, గోవా నేపథ్యంలో సాగే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని పేర్కొన్నారు. హీరోలు రవిచంద్ర, ఆదిత్య మాట్లాడుతూ మనిషి ప్రవర్తనలోని వివిధ కోణాలు, ఆసక్తికరమైన సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుందని, ప్రతి క్షణం ఉత్కంఠను పంచుతుందని తెలిపారు.

నిర్మాత జి. అశోక్ కుమార్ మరియు దర్శకుడు నాగేంద్ర ఆవుల మాట్లాడుతూ సినిమా అనుకున్నదానికంటే చాలా చక్కగా వచ్చిందని, పగలు రాత్రి అనకుండా కష్టపడి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. ట్రైలర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనే సినిమా విజయాన్న ముందే చాటుతోందని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు నాగమహేశ్ మాట్లాడుతూ, యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌తో ప్యాషనేట్ నిర్మాతలు ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు తీయడం అభినందనీయమని కొనియాడారు. అన్ని హంగులను పూర్తి చేసుకున్న ఈ వేల్ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.