BREAKING
వృద్ధుల హక్కులను కాపాడటం మన బాధ్యత కాపీరైట్ వివాదంలో సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు ఊహించని ఎదురుదెబ్బ.. కోర్టులో కీలక తీర్పు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుండి నడిపిస్తా పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి -యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోళ్ళ పవన్ కుమార్ ఆస్ట్రేలియా మేయర్‌గా తెలంగాణ ఆడబిడ్డ...! మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట నోటీసులు అందుకున్న ఓటర్ల వద్దకే బిఎల్ఓలు.. సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు అప్స డెమొక్రటిక్ డివిజన్ అధ్యక్షురాలుగా పోలిశెట్టి కనకదుర్గ భవాని రేపే ‘సిగ్మా’ సినిమా విడుదల.. పైరసీ చేసేవారికి హీరో సందీప్ కిషన్ గట్టి వార్నింగ్ బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటీటీ హడావుడి.. డిజిటల్ రైట్స్ కోసమే సినిమాలు చేస్తున్నారా? పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు మార్గం సుగమం.. ఉప సర్పంచ్‌ల జాప్యంపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి. డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

పల్లె పండుగ 3.0తో గ్రామాలకు మహర్దశ రూ.44 లక్షలతో నాలుగు గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ

Select Suryaa Now
పల్లె పండుగ 3.0తో గ్రామాలకు మహర్దశ  రూ.44 లక్షలతో నాలుగు గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ

పల్లె పండుగ 3.0తో గ్రామాలకు మహర్దశ

రూ.44 లక్షలతో నాలుగు గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ

రాప్తాడు మేజర్ న్యూస్:

పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఊపందుకుంది. రాప్తాడు మండలంలోని పాలబావి6 లక్షలు , చాపట్ల5లక్షలు , గొల్లపల్లి15లక్షలు , హంపాపురం 18లక్షలు  నాలుగు గ్రామాల్లో రూ.44 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ నిర్వహించారు.టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మండల కన్వీనర్ పంపుకొండప్ప , ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవతో గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మండల టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరపు మురళి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.

రోడ్ల నిర్మాణంతో గ్రామాల్లో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని గ్రామస్తులు పేర్కొంటూ ఎమ్మెల్యే పరిటాల సునీతకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమాల్లో ఎంపీడీఓ విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓలు అచ్యుతనంద, అశోక్‌బాబు, టీడీపీ రాష్ట్ర కురుబ కన్వీనర్ గంగలకుంట రమణ, క్లస్టర్ ఇన్‌చార్జిలు నారాయణస్వామి, రాము, సొసైటీ అధ్యక్షుడు గోపాల్, మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్ గంగలకుంట క్రిట్ట, ప్రతాప్, మధు, గ్రామ కమిటీ అధ్యక్షులు, డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.