పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
- పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన అడుసుమల్లి ప్రభాకర్
పామూరు, మేజర్ న్యూస్ : పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు గురువారం మండలంలోని బొట్లగూడూరు పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేశారు.పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోటపాటి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఎర్రగోళ్ల బాల, మాజీ వార్డు సభ్యుడు గుర్రం రమణయ్య, పారా జనార్ధన్, చిమ్మిలి వెంకటకృష్ణ, స్వర్ణ గ్రామ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.