BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు

Select Suryaa Now
ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు

ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాస్మా ఫెస్ట్-2026లో ఓవరాల్ చాంఫియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిఎంఎఐ తిరుపతి చాప్టర్ చైర్మన్, సీఎంఏ పార్థసారథి వారు పాల్గొని వివిధ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి కాంపిటేటివ్ ఈవెంట్లలో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ లెవల్స్, అకడమిక్ ఎబిలిటీ వంటి నైపుణ్యాలు మెరుగుపడతాయని సూచించారు. సౌత్ ఇండియాలో క్రీడా పోటీలు ఎక్కడ జరిగిన తిరుపతి చాప్టర్ విద్యార్థులను ప్రోత్సహించి పంపిస్తుందని తెలిపారు. పవర్ పాయింట్ విభాగంలో విద్యార్థులు అబ్దుల్, కావ్య మొదటి స్థానం సాధించగా జుసిర, విష్ణుప్రియ తృతీయ స్థానం సాధించారు. బిజినెస్ క్విజ్ విభాగంలో కౌషిక్, జశ్వంత్ మొదటి స్థానం సాధించారు. అలాగే ఈఆర్పీలో కౌషిక్, అబ్దుల్ మొదటి స్థానం, నవ్వ, జశ్వంత్ తృతీయ స్థానం సాధించారు. యాడ్ గేమ్ లో రాజీవ్, సమీక్ష, యశస్విని, శ్రీవంత్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో యతీష్, కావ్య మొదటి స్థానం సాధించారు. స్టార్ట్ ఆఫ్ ఏరినాలో విశాల్, భరత్ తృతీయ స్థానంలో నిలిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న విద్యార్థులను ఐసిఎంఎఐ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమరాల్డ్స్ కళాశాల ఉపసంచాలకులు మునిరత్నం, వైస్ చైర్మన్ గుర్రప్ప నాయుడు, ట్రెజరర్ ముస్తాక్ షేక్, ఎంసీ కమిటీ సభ్యురాలు రాధారాణి పాల్గొన్నారు.